- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో శుక్రవారం టీఎన్జీవో జిల్లా పంచాయతీ కార్యదర్శుల విభాగ అధ్యక్షుడిగా భిక్కనూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు వెంకట్ రెడ్డి తెలిపారు. సందర్భంగా నూతన అధ్యక్షులు మహేష్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం, పంచాయతీ కార్యదర్శులు, టీఎన్జీవో సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


