Saturday, January 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిలేజ్‌ క్రైమ్‌ డ్రామాతో 'అసుర సంహారం'

విలేజ్‌ క్రైమ్‌ డ్రామాతో ‘అసుర సంహారం’

- Advertisement -

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్‌ బ్యానర్‌పై సాయి శ్రీమంత్‌, శబరిష్‌ బోయెళ్ళ నిర్మిస్తున్నారు. కిషోర్‌ శ్రీకృష్ణ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌, సాంగ్‌ లాంచ్‌ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సుమారు 750కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన తనికెళ్ల భరణి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన విలేజ్‌ క్రైమ్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మిధున ప్రియ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ, ‘అసుర సంహారం అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్‌ కిషోర్‌ శ్రీకృష్ణ మంచి సబ్జెక్ట్‌ను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. విలేజ్‌లో డిటెక్టీవ్‌ పాత్ర పోషించాను. ఈ సినిమా నిర్మించడంలో, షూటింగ్‌ పార్ట్‌లో శబరిష్‌, మిధున ప్రియ మాకు బాగా సహకరించారు’ అని చెప్పారు. ‘ఈ సినిమా సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మారుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మిధున ప్రియ సహకారం మరువలేనిది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చిలో సినిమాను విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం’ అని దర్శకుడు కిషోర్‌ శ్రీకృష్ణ తెలిపారు. నటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మిధున ప్రియ మాట్లాడుతూ,’కొన్ని సినిమాల్లో నటించాను. ఇది నాకు పెద్ద సినిమా. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. ఈ సినిమాకు ప్రేక్షకుల సహకారం కావాలి’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -