Saturday, January 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలున్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ

న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ

- Advertisement -

సుమంత్‌ ప్రభాస్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘గోదారి గట్టుపైన’. రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌కు ఇది ఫస్ట్‌ వెంచర్‌. సుభాష్‌ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్‌ శుక్రవారం లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ,’గోదావరి అంటే జస్ట్‌ ఒక ప్రాంతం కాదు. అది ఒక కల్చర్‌ ఎమోషన్‌. ఒక కిటికీ నుంచి పల్లెటూరిని చూసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. మీరు టికెట్‌ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్‌ అవర్‌లో గోదావరి పడవ ఎక్కినట్టుగా ఉంటుంది. సినిమా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు. ‘మాయ క్యారెక్టర్‌లో నటించడం ఒక పెద్ద సవాల్‌గా అనిపించింది. మాయాలోని ప్రతి ఒక్క భావోద్వేగాన్ని సరికొత్తగా బయటకి తీసుకొచ్చారు మా డైరెక్టర్‌’ అని హీరోయిన్‌ నిధి ప్రదీప్‌ చెప్పారు. ‘ఒక చల్లటి సాయంత్రాన గోదావరి గట్టున కూర్చుని నలుగురు స్నేహితులు కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుంది. ఇదొక న్యూఏజ్‌ లవ్‌స్టోరీ’ అని డైరెక్టర్‌ సుభాష్‌ చంద్ర అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -