అగ్రకథానాయకుడు చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను ఈనెల 4న విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో చిరంజీవి హై ఓల్టేజ్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. అనిల్ రావిపూడి ఇప్పటికే ఇది హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు క్రైమ్ డ్రామా షేడ్స్ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని హింట్స్ ఇచ్చిన నేపథ్యంలో ట్రైలర్ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, కేథరీన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యూఎస్‌ఏ అడ్వాన్స్ సేల్స్ అద్భుతంగా ప్రారంభమయ్యాయి. వేగంగా 100కె నమోదు కావడం, ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమాపై ఉన్న మ్యాసీవ్ బజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోందని, సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 12న థియేటర్లలోకి గ్రాండ్‌గా సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం – భీమ్స్ సిసిరోలియో, డీవోపీ – సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ – ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటర్ – తమ్మిరాజు, రచయితలు – ఎస్ కృష్ణ, జి. ఆదినారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్.కృష్ణ, లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి, ఎడిషినల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్.
సంక్రాంతి బరికి సై..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



