– చేతిపై గాయాలు, మచ్చలను కనబడకుండా చేసేందుకే మేకప్
– మీడియా అపోహలు సృష్టించింది : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వయసు, ఆరోగ్యం గురించి వస్తున్న విమర్శలను ఖండించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన ఆరోగ్యం పూర్తిగా బాగున్నదని స్పష్టం చేశారు. ట్రంప్ వయసు ప్రస్తుతం 79 ఏండ్లు. అధ్యక్షుడిగా రెండో పదవీకాలాన్ని పూర్తి చేస్తే, పదవీ విరమణ సమయానికి ఆయన వయసు 82 ఏండ్లకు చేరుకుంటారు. అదే జరిగితే చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు.
ఇటీవల కొన్ని బహిరంగ కార్యక్రమాల్లో ట్రంప్ నిద్రపోతున్నట్టుగా కనిపించారనీ, చేతిపై మేకప్ పెట్టుకున్న ఫొటోలు వైరల్ కావడంతో ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలైంది. అక్టోబర్‌లో తాను ఎంఆర్‌ఐ స్కాన్ చేయించుకున్నానని చెప్పి తర్వాత దానిని సిటి స్కాన్ అని వివరించడం కూడా అనుమానాలకు దారి తీసింది. అయితే ఇవన్నీ మీడియా సృష్టించిన అపోహలు అని అన్నారు. ఫొటోగ్రాఫర్లు తాను కండ్లు మూసిన క్షణాన్ని పట్టుకొని ‘నిద్రపోతున్నాడు’ అనే ప్రచారాన్ని చేస్తున్నారని తెలిపారు. తాను రోజుకూ 325 మిల్లీగ్రాముల ఆస్పిరిన్ తీసుకుంటున్నానని కూడా వెల్లడించాడు. రక్తం పలుచగా ఉండేందుకే అలా చేస్తున్నాననీ, అయితే ఇదే కారణంగా చేతులపై గాయాలు, నీలి మచ్చలు పడుతున్నాయనీ, వాటిని కప్పి పుచ్చేందుకే మేకప్ వాడుతున్నానని ట్రంప్ వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వయసు, ఆరోగ్యం గురించి ట్రంప్ గతంలో తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ కూడా ఇవే తరహా ప్రశ్నలను ఎదుర్కొంటుండటం గమనార్హం. అయితే వయసు తనపై ఎలాంటి ప్రభావమూ చూపలేదని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



