– చామంతి సాగుపై అవగాహనా సదస్సు
– శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నిర్వహణ
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వ విద్యాలయంలోని పూల పరిశోధనా స్థానంలో శుక్రవారం ‘చామంతి సాగుపై అవగాహనా సదస్సు’ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ నలుమూలల నుంచి సేకరించిన అధిక దిగుబడినిచ్చే 120 రకాల చామంతి మొక్కలను ప్రదర్శించారు. అంతేకాక ఇక్కడ చేపట్టిన పరిశోధన ఫలితాలను రైతులకు వివరించారు. పరిశోధనలో ముఖ్యంగా నిర్దేశించిన మోతాదులో ఎరువుల వాడటం, సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత, సేంద్రియ పద్ధతిలో చామంతి సాగు చేసే పద్ధతులను వెల్లడించారు. కుండీలలో పెంచే పద్ధతులను సైతం తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భవానిరెడ్డి, రిజిస్ట్రార్ ఏ. భగవాన్, పరిశోధన సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ టి.సురేష్‌కుమార్, జోనల్ హెడ్ డాక్టర్ అనిత, స్థానిక ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ప్రశాంత్, ఎస్టేట్ ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్, పూల పరిశోధన సంస్థ హెడ్ డాక్టర్ జ్యోతి, శాస్త్రవేత్తలు డాక్టర్ సల్మా, డాక్టర్ గౌతమి, ఉద్యాన అధికారి కీర్తి, హైదరాబాద్, వికారాబాద్‌కు చెందిన లిల్లీ, చామంతి, జర్బెరా పండించే రైతులు పాల్గొన్నారు.
సేంద్రీయ పద్ధతిలో సాగు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



