Saturday, January 3, 2026
E-PAPER
Homeక్రైమ్ఏసీబీకి చిక్కిన కొల్లూరు ఎస్‌ఐ

ఏసీబీకి చిక్కిన కొల్లూరు ఎస్‌ఐ

- Advertisement -

– రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ వైనం
– కేసు నుంచి పేరు తొలగించేందుకు డబ్బులు డిమాండ్‌
నవతెలంగాణ-రామచంద్రాపురం

సంగారెడ్డి జిల్లా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. రమేష్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2025 అక్టోబర్‌లో కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన క్రైమ్‌ నెం.508/2025 (బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 318(4), ఎస్సెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 7) కేసులో ఫిర్యాదుదారుని పేరు తొలగించేందుకు ఎస్‌ఐ రూ.30,000 లంచం డిమాండ్‌ చేశారు. మొదటి విడతగా డిసెంబర్‌ 17న రూ.5,000 తీసుకున్నారు. కాగా, ఫిర్యాదుదారుడు తాజాగా ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కొల్లూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎస్‌ఐ ఫిర్యాదుదారుని నుంచి రూ.20,000 తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. ఎస్‌ఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -