– అనాజీపూర్ దాడి నిందితులను అరెస్టు చేయండి: పోలీసులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య ఆదేశం
నవతెలంగాణ-రాయపోల్
దళితులను వేధిస్తే సహించేది లేదని, అనాజీపూర్ దళితులపై మూకుమ్మడిగా దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని పొలీసులను, రెవెన్యూ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కివెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామానికి చెందిన దళితుడు పారునంది యాదగిరి కుటుంబంపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ఆధ్వర్యంలో బక్కివెంకటయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన బక్కి వెంకటయ్య పొలీస్, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి నిందితులను అరెస్టు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బైండోవర్ పేరుతో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి పారునంది యాదగిరిని ఎందుకు వేధిస్తున్నారని రాయపోల్ తహసీల్దారు, ఎస్‌ఐను ప్రశ్నించారు. కేసులుంటే కోర్టులో తేల్చుకుంటారని, లక్ష రూపాయలు కట్టమని మీరు ఎట్లా వేధిస్తారని నిలదీశారు. దళితులను వేధిస్తే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చూస్తూ ఊరుకోదని తహసీల్దార్‌ను హెచ్చరించారు. పద్దతి మార్చుకోకపొతే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో బాధితుడు పారునంది యాదగిరి, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి, ఎస్సీ, బీసీ, మైనారిటీ నాయకులు, మాజీ సర్పంచ్ జాఫర్, గజ్వేల్ రాంచంద్రం, సతీష్, చాకలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
దళితులను వేధిస్తే సహించం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



