– ల్యాప్స్ పాలసీల పునరుద్ధరణకు అవకాశం
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తమ పాలసీదారులకు మరోసారి అద్బుత అవకాశాన్ని కల్పిస్తుంది. నిలిచిపోయిన పాలసీలను పునరు ద్ధరించుకోవచ్చని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత ల్యాప్స్ పాలసీల కోసం జనవరి 1 నుండి మార్చి 2వ తేది వరకు ప్రత్యేక పునరుద్దరణ క్యాంపెయిన్ కొనసాగుతుందని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్ దొరైస్వామి తెలిపారు. ప్రీమియం చెల్లించని తేదీ నుంచి ఐదేండ్ల లోపు ఉన్న పాలసీలను ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుందన్నారు. తమ ప్రియమైన పాలసీదారులు ఆర్థిక భద్రతను పొందడానికి ఇదొక మంచి అవకాశమన్నారు.ఈ పథకం కింద పునరుద్ధరణ కు అర్హత ఉన్న అన్ని నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై ఆలస్య రుసుములో 30 శాతం వరకు లేదా గరిష్టంగా రూ.5,000 వరకు రాయితీని అందిస్తుంది. రూ. లక్ష వరకు 30 శాతం లేదా రూ.3,000 రాయితీ, రూ.1,00,001 నుంచి 3,00,000 వరకు 30 శాతం లేదా రూ.4,000 తగ్గింపు, రూ. 3,00,001 అంత కంటే ఎక్కువ పాలసీపై 30 శాతం లేదా రూ. 5,000 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చన్నారు.
ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్
- Advertisement -
- Advertisement -



