- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టుకు రానున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు టీటీడీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొండ గట్టు ఆలయ అభివృద్ధికి సహకారమందిస్తానని గతంలో పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఈ మేరకు టీటీడీ అధికారులతో చర్చించి రూ 35.19 కోట్లు మంజూరు చేయించారు. పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.
- Advertisement -



