Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

కాటారంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం గిరిజన గురుకుల బాలుర కళాశాలలో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆసనాడ మాధవి మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే మహిళల అభ్యున్నతి కొరకు, బాలికల కొరకు, నిమ్న వర్గాల అభ్యున్నతి కొరకు, అస్పృశ్యతను అరికట్టడానికి చేసినటువంటి ఎంతో కృషి చేశారని తెలిపారు.

 కుల, మత బేధాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని తెలిపారు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషిచేసిన తొలి తరం మహిళ ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. మహిళల హక్కుల కోసం చేసిన కృషిని కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయినీలకు వైస్ ప్రిన్సిపల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ బలరాం,  డిప్యూటీ వార్డెన్ రాజబాబు, శ్రీనివాస్,  నరేష్ , రజనీకాంత్ ,రాజయ్య కృష్ణమాచారి , సంతోష్ , సంపత్ రాజు, నాగమణి, రజిత , పద్మ , స్వప్న ఏఎన్ఎం ప్రీతి , పిడి కుడిమేత మహేందర్ , పి ఈ టి మంతెన శ్రీనివాస్ , కోచ్ మూల వెంకటేశ్ శాలువాలతో సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -