డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత. దీనివల్ల నిరంతరం విచారం, నిరాశ, ఏ విషయంపైనా దృష్టి పెట్టలేరని, దీని వల్ల ఆలోచన శక్తి క్షీణిస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి, నిద్రలేమి లాంటి సమస్యలు కూడా వస్తాయంటున్నారు. మానసిక కుంగుబాటును తొలి దశలో గుర్తించి కొన్ని చిట్కాలు పాటిస్తే బయటపడొచ్చంటున్నారు. మరి అవేంటో చూద్దాం…
బ భావోద్వేగాల్ని మీలోనే దాచుకుంటూ కుమిలిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. భయపట్టే సంఘటనలు, ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు, ఇంకా ఎలాంటి సమస్యలైనా సరే వాటిని డైరీలో నోట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత లభించడంతోపాటు కొంత భారం దిగినట్టు అనిపిస్తుందట. వీలైతే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మీ సమస్యలను వివరించడం వల్ల మనసు తేలికపడే అవకాశమూ ఉందని చెబుతున్నారు.
బ మనసుకు మరింత బాధ కలిగినప్పుడు మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను నెమరువేసుకొని మిమ్మల్ని ఉన్నతంగా ఊహించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిన్ననాటి విశేషాలు గుర్తుకు తెచ్చుకోవడం, మంచి మ్యూజిక్ వినడం మీకు నచ్చిన పనిలో నిమగమైపోయి బాధ నుంచి విముక్తి పొందాలని సూచిస్తున్నారు. అప్పటికీ ఫలితం లేకపోతే ఓ వారం లేదా పది రోజుల పాటు నచ్చిన ప్రదేశాలకు వెళ్లి రావాలని సలహా ఇస్తున్నారు.
బ మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి, శారీరకంగా ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవడానికి సరైన వ్యాయామం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కనీసం అరగంటపాటు వ్యాయామం చేయడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఫీల్ గుడ్ ఎండార్ఫిన్లు విడుదలై మనసు అందంగా, ఆహ్లాదంగా ఉండేలా చేస్తాయని చెబుతున్నారు. అందుకే వాకింగ్, జాగింగ్, యోగా, ఏరోబిక్స్, స్విమ్మింగ్, టెన్నిస్ ఇలా నచ్చిన అంశానికి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు కేటాయించాలని సూచిస్తున్నారు.
బ మానసిక ప్రశాంతత కరువడం, ఒత్తిడి పెరిగిపోవడం ఇలాంటి సమస్యలన్నింటికీ నిద్ర లేకపోవడం కూడా ప్రధాన కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే ప్రతి రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలైనా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా బయటపడండీ…
- Advertisement -
- Advertisement -