హీరో యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ ‘కొత్తల వాడి’ చిత్రంతో నిర్మాతగా మారారు. కన్నడ చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడు డా.రాజ్‌కుమార్, ఆయన సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్‌ల స్ఫూర్తితో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి పిఏ ప్రొడక్షన్స్ పేరుతో ఆమె చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. పథ్వీ అంబార్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా సిరాజ్ రచన, దర్శకత్వంలో రూపొందుతోంది. గత నెలలో ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చి సినిమాపై అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో మేకర్స్ బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. పాత్రల్లోని ఇన్‌టెన్సిటినీ తెలియజేసేలా ఓ సరికొత్త ప్రపంచాన్ని టీజర్‌లో పరిచయం చేశారు. మాస్, కమర్షి యల్ ఎలిమెంట్స్‌తో టీజర్ ఆకట్టు కుంటోంది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ అందించిన సూపర్బ్ విజువల్స్, అభినందన్ కశ్యప్ కంపోజ్ చేసిన పవర్‌ఫుల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయి. రూటెడ్, పవర్‌ఫుల్ కథతో ఈ సినిమాను మన ముందుకు డైరెక్టర్ సిరాజ్ తీసుకురా బోతున్నారనే విషయం అర్థమవుతుంది అని చిత్ర బృందం తెలిపింది.