కాలం అలలపై ప్రయాణిస్తూ ఎగసి పడుతుంది.
కాలం కన్నుగప్పి కంటికి అందకుండా కరుమరుగైతుంది.
కలలన్నీ కన్నీరై కారుతుంటే …
జ్ఞాపకాలై దుఃఖపుగుండెను ఓదార్చుతుంది.
మరో వసంతమై వస్తున్నానని ….
విజయాలను నీకిస్తానని చల్లనిగాలితో కబురు పంపుతుంది.
ధైర్యమనే రెక్కలనుకట్టుకొని ఎగరమంటుంది.
అలసిపోయిన ఎదకు మళ్ళీ కొత్తచిగురు
పూయిస్తానని నిత్యం భానుడితో
ఉదయాన్నే ఉత్తరాన్ని పంపుతుంది.
వానచినుకుల్లా రాలుతున్న కాలం.
అన్నిఅనుకూలమై అందరిని ఆదుకోవాలి.
పూరింట్లో …పేదింట్లో…పసిడికాంతులు కురవాలి.
గతమంతా గుణపాటమై భవిష్యత్తుకు పునాధివేయాలి.
పల్లెపట్నం నవశోభతో వెళగాలి.
కొత్త క్యాలెండరులోని నెంబర్లు…
తేదీలై జారిపోతూ…బతుకుజీవుడి పోరాటానికి అండగా నిలవాలి.
సంవత్సరం అంతా సంకటాలులేని సంతోషాన్ని ఇవ్వాలి.
కర్షకుడి కష్టం తాలుగింజలై ఎగిరిపోకుండా
కాలం కంటికి రెప్పలా కాపలావుండాలి.
శ్రమజీవి స్వేదంతో నిర్మించిన విశ్వంపై
కార్మికుడి చేవ్రాలు చెదిరిపోకూడదు.
కొత్తసంవత్సరం కొత్తచిగురులా చిగురించాలి.
అందరికి పచ్చని జీవితాన్ని ప్రసాదించాలి.
అశోక్ గోనె, 9441317361
కొత్తచిగురు…
- Advertisement -
- Advertisement -



