నవతెలంగాణ- రాయపోల్
భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3న మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వ అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని రాయపోల్ మండల ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి, వడ్డేపల్లి సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్ అన్నారు. శనివారం రాయపోల్ మండల పరిధిలో పాఠశాలలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలు నిర్వహించారు, ఎల్కల్, వడ్డేపల్లి పాఠశాలలో వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ కాలంలో భారతదేశంలో మహిళలను వంటింటికిి మాత్రమే పరిమితం చేశారు.సావిత్రిబాయి పూలే కృషి వలన ప్రస్తుతం మహిళలు అంతరిక్షంలోకి కూడా వెళ్లగలుగుతున్నారు.మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాలలో సమానంగా రాణించగలుగుతారు. మహిళలకు చదువు నిరాకరించిన రోజులలో అగ్ర కులాల నుండి ఎన్నో అవమానాలను ఎదుర్కొని పట్టుదలతో తన భర్త జ్యోతిరావ్ పూలే సహకారంతో విద్య నేర్చుకొని ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొంది 1848 సంవత్సరంలో దేశ చరిత్రలో మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా పూణేలో మొదటి ఉచిత పాఠశాల స్థాపించి మహిళలను విద్యావంతులుగా చేశారు.ఆ రోజుల్లో శూద్రుల విద్యకొరకు హంటర్ కమిషన్ కి మొదటి విజ్ఞాపన పత్రం ఇచ్చి మనకి విద్య అందేలా పోరాటం చేసిన పుణ్య దంపతులే మహాత్మా జ్యోతీరావుఫూలే, సావిత్రిభాయి ఫూలే. ప్రజలంతా నిజమైన చరిత్ర తెలుసుకుని నిత్యం ఛైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు.విద్యాభివృద్ధికి, మహిళ అభ్యున్నతికి, సమాజ చైతన్యానికి ఏమాత్రం కృషి చేయని వ్యక్తుల పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం బడుగు బలహీన వర్గాల పట్ల మనువాద ఆధిపత్య కులాల కుట్ర అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని అనాధలు, నిరుపేదలు,ప్లేగు వ్యాధిగ్రస్తులు, మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉత్తమ గురువు సావిత్రిబాయి పూలే అన్నారు. జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి ఉపసర్పంచ్ స్వామి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బహుజన క్రాంతి రేఖ సావిత్రిబాయి పూలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



