Thursday, May 22, 2025
Homeరిపోర్టర్స్ డైరీమైసూర్‌ భారత్‌

మైసూర్‌ భారత్‌

- Advertisement -

పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది భారతీయులను కాల్చిచంపారు. ప్రతిగా ఇండియన్‌ ఆర్మీ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ తర్వాత పాక్‌ చేసిన కవ్వింపు చర్యలకు కూడా మన సైన్యం దీటుగా స్పందించింది. అందుకు దేశమంతా సైన్యానికి సెల్యూట్‌ చేసింది. మద్దతు తెలిపింది. అనంతరం కాల్పుల విరమణ జరిగింది. ఆ తర్వాత దేశంలో సోషల్‌ మీడి యాలో రకరకాల పుకార్లు వ్యాపింపజేశాయి. అవే యుద్ధాన్ని సృష్టించాయి. రాకెట్లు విసిరాయి. మంటలు లేపాయి. చల్లార్చాయి. సైరన్లు మోగించాయి. చివరికి టీవీల్లో సైరన్లు మోగించ కూడదంటూ కేంద్రం సీరియస్‌ కావాల్సి వచ్చింది. అయినా సరే వాటి పైత్యం అంతా ఇంతా కాదు. ఆ ప్రభావమే కావొచ్చు మైసూర్‌ పాక్‌ (స్వీట్‌) పేరు కూడా మార్చింది. మైసూర్‌లోని అంబ విలాస్‌లో మహారాజ క్రిష్ణరాజా వడియార్‌ను మైసూర్‌ పాక్‌ను 1935లో ప్రారంభించారు. దాదాపు ఎనభై ఏండ్ల క్రితం మొదలైన ఆ పేరును మార్చుకుంది. మైసూర్‌ పాక్‌లో పాకిస్తాన్‌ అనే ఉచ్ఛరణ ఉందనే కారణంగా దాన్ని తొలగించి మైసూర్‌ భారత్‌ అయినట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల్లో మైసూర్‌ భారత్‌ లేనిదే ఆ పండగ పసందుగా ఉండదు. కానీ కరివేపాకు, వేపాకులో పాక్‌ ఉంది మరి. వాటికి ఏం పేర్లు పెడతారో తెలియదు. కోవిడ్‌ సమయంలోనూ కరోనా చైనా నుంచి రవాణా అయిందని, ఆ పేరుతో ఉన్న చైనా బజార్లు చిన్నా బజార్లుగా మార్చివేశారు. కరాచీ బేకరి బోర్డులపై దాడి చేస్తున్నారు. దేశంలో ఎన్నో ప్రాచీన కట్టడాలను ఆనాటి రాజులు నిర్మించారు. సహజంగా వారి పేర్లు ఉన్నాయి. వాటి పేర్లు కూడా మార్చుతారేమో. మైసూర్‌ పాక్‌ల మైసూర్‌ ఉండదు. నేతిబీరలో నెయ్యి ఉండదు. కానీ పేరు మార్చడం వల్ల దాన్ని రుచి తగ్గదు. ఏదో కొంత మంది ‘ఈగోలు’ సంతృప్తి చెందుతాయంతే.
– గుడిగ రఘు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -