Thursday, May 22, 2025
Homeఎడిట్ పేజిప్రజాకోణంలోనే..

ప్రజాకోణంలోనే..

- Advertisement -

కాళేశ్వరం బ్యారేజీల నాణ్యతా లోపాలు, అవకతవకలపై న్యాయ విచారణ కీలకమలుపు తిరిగింది. మాజీ సీఎం కేసీఆర్‌, అప్పటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రస్తుత బీజేపీ ఎంపీ, అనాటీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ జారీచేసిన నోటీసులు పెను సంచలనమయ్యాయి. సాధారణ ప్రజలతోపాటు మేధావులు, రాజకీయ నేతల్లోనూ చర్చోపచర్చలకు ఆస్కారం కలిగింది. నిర్మాణ పర్యవేక్షణ, నిధుల విడుదలకుగాను ఈ ముగ్గురికి కమిషన్‌ శ్రీముఖాలు పంపింది. ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన చేయగా 2019లో పూర్తయింది. అత్యంత తక్కువ కాలంలో నిర్మించిన ప్రాజెక్టుగా అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రపంచానికి గొప్పగా చెప్పుకుంది. మూడ్లేండ్లు అయిందో లేదో అప్పుడే కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు ఒక్కొ క్కటిగా బయటపడ్డాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పగు ళ్లు, సీపేజీలు అవినీతికి ఆనవాళ్లుగా మిగిలాయి. చివరకు రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి కలలను చిధ్రం చేశాయి.
రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుకు ఒక్కసారిగా నిట్టనిలువునా పగుళ్లు రావడంతో తెలంగాణ అవాక్క యింది. పోలీస్‌ విజిలెన్స్‌ విభాగం ఏడాది కిందే విచారించి అక్రమాలు జరిగాయని తేల్చేసింది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస ్థ(ఎన్డీఎస్‌ఏ) సైతం ప్రపంచంలోనే అత్యంత నిర్లక్ష్యంతో కట్టిన ప్రాజెక్టు అంటూ వ్యాఖ్యా నించింది. భవి తవ్యం పట్ల గ్యారంటీ ఇవ్వలేకపోయింది. దీంతో కోట్లాది రూపాయల విలువైన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. నిర్మాణ అనంతరం రెండేండ్లయినా కనీస నిర్వహణా ప్రోటోకాల్‌ను పాటించకపోవడంతో ఏకంగా ప్రాజెక్టుకే ముప్పు తెచ్చింది. బ్యారేజీలు నీటి మళ్లీంపు కోసం కాకుండా నీటి నిల్వ కోసం కట్టడమే అనర్థానికి మూలమని ఎన్డీఎస్‌ ఏ స్పష్టం చేసింది. నదులకే నడక నేర్పామంటూ గోప్పలుపోయిన బీఆర్‌ఎస్‌ నేతలు, ఇప్పుడు కుంటిసాకులు వెతుక్కుంటున్నారు. అవినీతి జరిగిందని ఎన్డీఎస్‌ఏ చెప్పలేదంటూ బుకా యించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణాళిక, డిజైన్లు, బ్యారేజీ నిర్మాణ స్థలాల మార్పు, ప్రాజెక్టు బడ్జెట్‌ అంచ నాలను ఎప్పటికప్పుడు పెంచడం అంతా అప్పటి సర్కారు పెద్దల కను సన్నల్లో జరిగాయన్నది జగమెరిగిన సత్యం.
న్యాయవిచారణ రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజాకోణంలో సాగాలి. స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టాలి. కాళేశ్వరాన్ని లక్ష కోట్లతో కట్టారు. అవినీతి జరిగిందా? అవకతవకలకు బాధ్యు లెవరు? తదితర కీలకాంశాలను నిగ్గు తేల్చాలి, రాజకీయ నాయకులు, అధి కారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారనేది స్పష్టం. పనుల్లో నాణ్యత లోపించి పర్యావరణానికి సైతం ముప్పు ఏర్పడిందని ఎన్డీఎస్‌ఏ నివేదిక పేర్కొంది. వీటన్నింటిపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ స్పష్టమైన నివేదిక ఇస్తుందనే ఆశిద్దాం. తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తుందనే నమ్ముదాం. ఇకపోతే ఒక చట్ట బద్దమైన సంస్థ ఇచ్చిన నోటీసులను కేసీఆర్‌ గౌరవించాల్సిన అవసర ముంది. రాజకీ యాలెలా ఉన్నా తన పాలనలో నిర్మితమైన భారీ నీటి పారుదల ప్రాజెక్టు విఫలమవడంపై పాత ప్రభుత్వ పెద్ద స్పందిం చాల్సిందే. విచారణకు హాజరై నిజాలను తెలంగాణ ప్రజలముందుంచాల్సిందే. గతంలో జస్టిస్‌ ఎల్‌.నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలోని విద్యుత్‌ కమిషన్‌ నోటీ సులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లి భిన్నంగా స్పందించిన కేసీఆర్‌, ఇప్పుడెలా వ్యవహరి స్తారో చూడాలి.అయితే ఇక్కడ విజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరముంది. విచారణకు సహకరిం చకపోతే అభాసు పాలయ్యే పరిస్థితి ముందే ఉందన్న విషయాన్ని గమనించాలి.
అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం రాజకీయ కోణంలో కాకుండా ప్రజా కోణంలోనే ఆలోచించాలి. చట్టాన్ని తన పని తాను చేసుకు పోనివ్వాలి. రాజకీయ కక్షలు, వివక్షకు అసలు తావుండ కూడదు. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు సగం నిధులు కాళేశ్వ రానికే ఖర్చు పెట్టారు. ఇప్పటికే లక్ష కోట్లు ఒడిసినా, ఇంకా రూ.45 వేల కోట్లు వ్యయం చేస్తేనే ప్రాజె క్టు పూర్తవుతుందని గతంలోనే ‘కాగ్‌’ సెలవిచ్చింది. ఇప్పుడా ఏడో పిల్లర్‌ మరమ్మతు ఖర్చు అదనం. అసలే అప్పులు చేస్తున్న పాల కులకు ఇది ఆశనిపాతమే. పిడుగు సమానమే. ఘోష్‌ కమిషన్‌ కాళేశ్వరం ప్రజాధనాన్ని అవినీతి పరుల బొక్కసాల్లో నుంచి తవ్వి తీయాలి. అక్రమాల కలుగును అంతమొందించాలి. భవిష్యత్‌లో ఏ పాల కులు ప్రజాధనాన్ని కొల్ల గొట్టకుండా అడ్డుకోవాలి. ప్రజల సొమ్ముకు రక్షకులుగా ఉండాలి. నిజానికి ప్రాజెక్టు పూర్తయిన తొలినాళ్లల్లో కాళేశ్వరాన్ని తెలంగాణ జీవనరేఖగా చెప్పుకొచ్చారు. ఇప్పుడది ప్రశ్నార్థకం. ఇదిలావుండగా తెలంగాణ ప్రజలకు న్యా యం చేయాల్సిన బాధ్యత జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌తోపాటు రేవంత్‌ సర్కారుది కూడా. అక్రమార్కులు మింగిన అవినీతి సొమ్మును కక్కించాలి. వారు పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరైనా సరే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -