నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేంద్రీవాల్ బడుగు బలహీన అనగారిన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పథకాలను ప్రవేశ పెట్టడం వలన అందుకు ఆయనను ఆదర్శంగా తీసుకొని పలువురు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినట్టు జిల్లా అధ్యక్షులు సమీర్ హైమద్ ఆదివారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దిద్ది సుధాకర్ ఆదేశాల మేరకు పట్టణంలో వార్డ్ ల నుండి 13వ వార్డు రాము ముదిరాజ్ 7వ వార్డు రవి రెడ్డి 16వ వార్డు హన్సన్ రాజ్ 20వ వార్డు షకీల్, కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇన్చార్జ్ సయ్యద్ ఆవేశ్, ఉపాధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, జనరల్ సెక్రెటరీ మమ్మద్ రజాక్, యూత్ అధ్యక్షులు సాయి తేజ, బీసీ ఓబీసీ అధ్యక్షులు కటారి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



