Thursday, May 22, 2025
Homeరాష్ట్రీయంవిశ్రాంత ఐఏఎస్‌ జీఎన్‌ రావు కన్నుమూత

విశ్రాంత ఐఏఎస్‌ జీఎన్‌ రావు కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విశ్రాంత సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు (జీఎన్‌ రావు) బుధవారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. 1988 బ్యాచ్‌కు చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ హౌదాల్లో పనిచేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో యువజన సర్వీసులు, పౌరసరఫరాలు, జౌళి శాఖ, ఉన్నత విద్యాశాఖ కమిషనర్లుగా, శిల్పారామం స్పెషల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన మరణం పట్ల పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ ప్రగాఢ సానుభూతినీ, సంతాపాన్ని తెలిపారు. ఆయన అంత్య క్రియలు శుక్రవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -