Wednesday, January 7, 2026
E-PAPER
Homeజిల్లాలువీబిజీ రాంజీ ఉపాధి పథకమును రద్దు చేయాలి

వీబిజీ రాంజీ ఉపాధి పథకమును రద్దు చేయాలి

- Advertisement -

గ్రామ మండల జిల్లా కేంద్రాలలో నిరసనలకు ఏఐకేఎంఎస్ పిలుపు

– ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్యా

నవతెలంగాణ -ధర్పల్లి: మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీరంజి ఉపాధి పథకమును రద్దు చేయాలని ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని జాబ్ కార్డు ఉన్న వారికి 200 కల్పించాలని ఒక రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు , ఈ చట్టాన్ని రద్దు చేస్తూ గ్రామ సభలో తీర్మానం చేయాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు.

1966 లో చేసిన విత్తన చట్టం 19 83 సంవత్సరంలో రూపొందించబడిన విత్తన నియంత్రణ ఆర్డర్ ను కేంద్ర ప్రభుత్వము తొక్కి పెడుతున్నదని రాజ్యాంగపరంగా వ్యవసాయ రంగంపై రాష్ట్రాలకు ఉండే హక్కులను, హరించి వేస్తున్నదని వారు ఆరోపించారు.బహుళ జాతి విత్తన సంస్థలైన మూన్సాంటో గార్గిల్ డ్యూ పాయింట్ కార్గిల్ లాంటి సంస్థలకు విత్తనం ఉత్పత్తి నీ కట్టబెట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకు వస్తుందని వారన్నారు. ప్రజలకు ఉపయోగపడే అత్యవసర సర్వీసుల లో భాగమైన విద్యుత్, రంగం ను ప్రజల నుండి దూరం చేస్తూ మోడీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా బిల్లు తీసుకువస్తుందని విమర్శించారు.దీనివల్ల ప్రీపెయిడ్ పద్ధతి ద్వారా విద్యుత్తును రైతులు కొనుగోలు చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.స్మార్ట్ మీటర్ల ద్వారా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చే ఈ బిల్లును వ్యతిరేకించాలని రైతాంగాన్ని వారు కోరారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య. ఎఐకెఎంఎస్ నాయకులు నిమ్మల భూమేష్. ఎన్.గంగారాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -