Thursday, May 22, 2025
Homeరాష్ట్రీయంప్రభుత్వ వైద్యాన్ని విశ్వసిస్తేనే సంపన్న దేశం : ముఖ్యమంత్రి

ప్రభుత్వ వైద్యాన్ని విశ్వసిస్తేనే సంపన్న దేశం : ముఖ్యమంత్రి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలు ప్రయివేటు ఆరోగ్య సంరక్షణను భరించగలిగితే ఆ దేశం ధనిక, సంపన్న దేశం కాబోదని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను విశ్వసించినప్పుడే ధనిక, సంపన్న దేశంగా పరిగణించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన 17 నెలల్లో ప్రజల విశ్వసించిన అనేక సందర్భాల్లో వేములవాడ కూడా ఇలాంటి సందర్భాన్ని వెలుగులోకి తెచ్చిందని పేర్కొన్నారు. సివిల్‌ జడ్జి జ్యోతిర్మయి తన ప్రసవానికి ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాన్ని ఎంచుకుని ఒక ఉదాహరణగా నిలిచారని సీఎం పేర్కొన్నారు. ఈ ఎంపిక ఆమె రెండో బిడ్డకు కూడా ఒక గొప్ప అవకాశమని తెలిపారు. నూతన శిశువు తెలంగాణకు ఒక ఆశాకిరణమని సీఎం అభివర్ణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -