Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంప్రపంచశాంతిని కాలరాసే కుట్ర

ప్రపంచశాంతిని కాలరాసే కుట్ర

- Advertisement -

అమెరికా దుశ్చర్యపై మోడీ సర్కార్‌ సైలెంట్‌
వెనిజులాపై దాడిని ప్రధాని, కేంద్రప్రభుత్వం ఖండించాలి : సీపీఐ(ఎం)పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
ఢిల్లీలో ఆందోళన

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వభౌమ దేశమైన వెనిజులాపై అమెరికా దాడిని, అధ్యక్షడు నికోలస్‌ మదురో, ఆయన భార్యను కిడ్నాప్‌ చేయడాన్ని ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆందోళన చేపట్టాయి. ఆదివారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలు ఆందోళనకు నాయకత్వం వహించాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐఎస్‌ఎ తదితర విద్యార్థి సంఘాల కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. అమెరికా ప్రపంచవ్యాప్తంగా శాంతిని నాశనం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందని, అమెరికా, ట్రంప్‌కు గొడుగు వేసిందని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. అమెరికా రెచ్చగొట్టే చర్యను ఖండించడానికి ప్రధామోడీ,కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -