Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెండవ రోజు ముగిసిన టెట్‌ పరీక్షలు

రెండవ రోజు ముగిసిన టెట్‌ పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రెండవ రోజు ఆదివారం ఉదయం సెషన్‌లో జరిగిన టెట్‌ పేపర్‌ 2లో 22,546 మందికిగాను 18,235 మంది (80.88 శాతం) హాజరయ్యారు. 4,311 మధ్యాహ్నం జరిగిన టెట్‌ పేపర్‌ 2 పరీక్షకు 22,912 మందికి గాను 18,819 మంది (82.03 శాతం) హాజరయ్యారు. మొత్తంగా రెండవ రోజు 45,458 మందికిగాను 37,054 మంది (81.5 శాతం) హాజరయ్యారు. నేడు, రేపు (5, 6 తేదీల్లో) సోషల్‌ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఆదివారం పరీక్షల్లో ప్రశ్నల సరళి మధ్యస్థంగా ఉందనీ, తెలుగు, సైకాలజీ మెథడాలజీ విభాగాల్లో ప్రశ్నల సరలి తేలికగానే ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌ ప్రశ్నల్లో కొన్ని సులభంగా కొన్ని కఠినంగా వచ్చాయి. మేడారం జాతరపై, పలువురు కవులపై, ఛందస్సుపై, ఇన్‌స్పైర్‌ మనక్‌పై, వివిధ పంట రకాల వ్యాధులపై, జాతీయ పాఠ్య ప్రణాళికపై ప్రశ్నలడిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -