జైలు వద్ద మదురోను విడుదల చేయాలని కోరుతూ మద్దతు దారుల నిరసన
న్యూయార్క్: ఆపరేషన్ ‘ఆబ్జల్యూట్ రిజాల్వ్’ చేపట్టిన అమెరికా.. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని బంధించి న్యూయార్క్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిని బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ (ఎండీసీ)లో ఉంచారు. ఆర్.కెల్లీ, సీన్ డిడ్డీ కాంబ్స్ వంటి మ్యూజిక్ స్టార్‌లు ఉన్న ఈ జైలు ఎంతో సమస్యాత్మకమైందిగా భావిస్తుంటారు. నిందితులను అక్కడికి పంపించేందుకు కొందరు న్యాయమూర్తులే నిరాకరిస్తారనే ప్రచారం వ్యాప్తిలో ఉంది.
ఎప్పుడు ప్రారంభించారు..
బ్రూక్లిన్‌లోని ఎండీసీని 1990లో ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ 1300 మంది ఖైదీలు ఉన్నారు. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ మన్‌హటన్, బ్రూక్లిన్ ఫెడరల్ న్యాయస్థానాల్లో విచారణ కోసం వేచిచూస్తున్న వారిని ఇక్కడికి పంపిస్తుంటారు. వైట్‌కాలర్ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితోపాటు గ్యాంగ్‌స్టర్‌లు, మాదకద్రవ్యాల కేసులో నిందితులను ఉంచుతారు. వెనిజులా అధ్యక్షడు మదురో ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు.
భూమిపై నరకంగా..
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి కనుచూపు మేరలో ఉన్న ఈ జైలుపై అనేక విమర్శలు ఉన్నాయి. ఇక్కడి దారుణ పరిస్థితుల కారణంగా దీన్ని భూమిపై నరకం (హెల్ ఆన్‌ఎర్త్), నిరంతర విషాదం (ఆన్ గోయింగ్ ట్రాజిడీ)గా అభివర్ణిస్తారు. ఇక్కడ హింసాత్మక ఘటనలపై ఖైదీలు, వారి న్యాయవాదుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి. 2024లో సహచరుల చేతిలో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు. నిషేధిత వస్తువులు అనుమతించడం, లంచాలు తీసుకుంటున్నారని జైలు సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. 2019లో విద్యుత్ అంతరాయం కారణంగా వారంపాటు ఖైదీలు చలి, చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే, ఇటీవల ఇక్కడ పరిస్థితులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నామని జైళ్ల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
బ్రూక్లిన్ జైల్లో మదురో.. అదో నరకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



