Thursday, May 22, 2025
Homeరాష్ట్రీయంమావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ అప్రజాస్వామికం

మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ అప్రజాస్వామికం

- Advertisement -

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

చత్తీస్‌ఘడ్‌లో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. శాంతి చర్చలకు సిద్ధమేనంటూ మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్‌కౌంటర్‌ చేయడం అప్రజాస్వామిక మని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. సమాజంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, మేధావులు, రచయి తలు మావోయిస్టులతో తక్షణమే చర్చలు జరపాలంటూ కోరుతున్నారని తెలిపారు. కేంద్రం మొండి వైఖరి ప్రదర్శించడాన్ని ఖండించారు. ఎలాంటి సమస్యకైనా చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది చరిత్ర రుజువు చేస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపేయాలనీ, మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. మావోయిస్టులు, వామపక్ష భావజాలాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్‌ కగార్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేప ట్టిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్‌ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచే శారు. ఈ ఎన్‌కౌంటర్లు పౌరహక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
మావోయిస్టుల హత్యను ఖండించిన న్యూడెమోక్రసీ
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోసహా 25 మందికిపైగా మావోయిస్టులను హత్య చేయడాన్ని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభు త్వం హత్యాకాండను కొనసాగిస్తున్నదని విమర్శించారు. దీన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. మేధావులు, ప్రజాస్వామికవాదులు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని తెలిపారు. అయినా మోడీ, అమిత్‌షా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. నరమేధాన్ని తీవ్రతరం చేసిందని విమర్శించారు. అడవి నుంచి ఆదివాసీలను ఖాళీచేయించి ఆ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టేందుకే ఆపరేషన్‌ కగార్‌ను కేంద్రం చేపట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టిం జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
ఈ నరమేధం ఆపాలి : మాస్‌లైన్‌
చత్తీస్‌ఘడ్‌ నారాయణపూర్‌ జిల్లా మాద్‌ అడవుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక బలగాలు పెద్దఎత్తున చుట్టుముట్టి మావోయిస్టు పార్టీ నేతలు, గెరిల్లా దళ సభ్యులను 30 మందిన ఎన్‌కౌంటర్‌లో చంపినట్లు వార్తలొచ్చాయని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా చనిపోయినట్టు ప్రచారం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ నరమేధం ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేశ పౌరుల మీద, ప్రజల తరఫున నిలబడే వారిమీద అంతర్గత యుద్ధం చేయడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వ విధానంగా ఉందని తెలిపారు. శాంతియుత చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రతిపాదనను కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కేంద్రం ఫాసిస్టు విధానాన్ని అమలు చేస్తున్నదని విమర్శించారు. పచ్చటి అడవిని, ఆదివాసీ ప్రాంతాలను ధ్వంసం చేయొద్దని కోరారు. అదానీ, అంబానీ ఇతర విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీల ధనదాహం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రజలను, ప్రజా నాయకులను కాల్చి చంపడం ఆపాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలనీ, న్యాయ విచారణ జరపాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -