– డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వెనిజులాపై అమెరికా యుద్దోన్మాద దాడులను అప్రజాస్వామిక చర్యలను, అక్రమ అరెస్టుల కుట్రలను భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈమేరకు ఆదివారం డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్వతంత్ర దేశంపై అమెరికా సాగిస్తున్న ఆధిపత్య ధోరణి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తెలిపారు. వెనిజులా ప్రజల తీర్పును గౌరవించకుండా, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయాలని అమెరికా ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకే విఘాతమని పేర్కొన్నారు. వెనిజులాలోని సహజ వనరులను, చమురు నిల్వలను హస్తగతం చేసుకోవడమేనని తెలిపారు. అమెరికా ఈ తరహా అక్రమ ఆంక్షలకు, కుట్రలకు పాల్పడుతోందని తెలిపారు. వెనిజులా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ మదురో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూడటం అమానుషమని తెలిపారు. వెనిజులా అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడిని ఎన్నుకునే హక్కు కేవలం వెనిజులా ప్రజలకు మాత్రమే ఉందని తెలిపారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వెనిజులా యువతకు, ప్రజలకు డీవైఎఫ్‌ఐ సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేశారు.
అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



