- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: UPI ద్వారా డబ్బు పంపడం సులభం, కానీ తప్పు ID లేదా ఖాతాకు పంపితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా UPI యాప్ లావాదేవీ హిస్టరీని చెక్ చేయాలి. లావాదేవీ విజయవంతమైతే, UTR నంబర్ కీలకం. చాలా UPI యాప్‌లు తప్పు లావాదేవీపై ఫిర్యాదు చేసే ఆప్షన్ ఇస్తాయి. ఫిర్యాదు తర్వాత వెంటనే బ్యాంకును సంప్రదించాలి. వీలైతే, డబ్బు ఎవరికి వెళ్లిందో వారిని సంప్రదించి తిరిగి కోరవచ్చు. సమస్య పరిష్కారం కాకపోతే NPCI, RBI బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, డబ్బు తిరిగి పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి.
- Advertisement -



