Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంగ్యాస్ నిల్వలపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

గ్యాస్ నిల్వలపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియా యుద్ధం నేప‌థ్యంలో గ్యాస్ నిల్వలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. చమురుశుద్ధి సంస్థలపై ఎస్మా (ESMA – Essential Services Maintenance Act) చట్టాన్ని ప్రయోగించింది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధ్యాన్యం ఇస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ చర్యలు చేపట్టింది.ప్రాధాన్య‌త క్ర‌మంగా గ్యాస్ సిలిండ‌ర్ల‌ను కేటాయించాల‌ని కేంద్రం పేర్కొంది.

మ‌రోవైపు హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని హోటళ్ యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తాజాగా చెన్నై హోటళ్ల అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను సైతం రాసింది. ఈ నిర్ణయం వల్ల చెన్నై నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -