– మోడీ ప్రభుత్వ కుట్రలు తిప్పికోడదాం
– అవినీతిమయమైన టీఎంసీని గద్దెదింపాలి: సీపీఐ(ఎం) అగ్రనాయకురాలు బృందాకరత్
కోల్కతా : ఆదివాసీ హక్కులపై మోడీ ప్రభుత్వం అప్రకటిత యుద్ధం చేస్తోందని సీపీఐ(ఎం) అగ్ర నాయకురాలు బృందాకరత్ విమర్శించారు. పురూలియా, బంకురా జిల్లాల్లోని ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బృందాకరత్ సమావేశాలు, రోడ్ షోలలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ బతుకుల్ని చిన్నాభిన్నం చేసేలా అడుగులేస్తోందని అన్నారు. అవినీతిమయమైన టీఎంసీ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని, దానికి వామపక్షాలు మాత్రమే ప్రత్యామ్నాయాన్ని అందించగలవని ఆమె అన్నారు. ఈ నియోజకవర్గాల అభ్యర్థులైన కేంద్ర కమిటీ సభ్యురాలు దేబోలినా హెంబ్రమ్, శాంతిమోని ముర్ము, రామచంద్ర మండ్ ఆమెతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
ఆదివాసీ హక్కులపై అప్రకటిత యుద్ధం
- Advertisement -
- Advertisement -



