– తమిళనాడు హక్కులను కాపాడేశక్తి వాటికి ఉన్నది : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు విజ్జూ కృష్ణన్
చెన్నై : తమిళనాడు హక్కులను కేవలం ‘లౌకిక ప్రగతిశీల కూటమి’ మాత్రమే పరిరక్షించగలదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు విజ్జూకృష్ణన్ పేర్కొన్నారు. పళని నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎన్.పాండికి, తొండముత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎన్.ఆర్.కార్తికేయన్‌కు మద్దతుగా విజ్జూ కృష్ణన్ ఎన్నికల సభల్లో ప్రసంగించారు. కేంద్రం నుంచి ఎదురయ్యే దాడులను తిప్పికోట్టే దమ్ము,ధైర్యం ‘లౌకిక ప్రగతిశీల కూటమి’కి ఉన్నదని స్పష్టం చేశారు. మోడీ సర్కార్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు చరమగీతం పాడేలా ఓటర్లు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
లౌకిక ప్రగతిశీల కూటమిని గెలిపించండి
- Advertisement -
- Advertisement -



