Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంచెన్నై సూపర్‌-6

చెన్నై సూపర్‌-6

- Advertisement -

నగరం కోసం డీఎంకే ప్రత్యేక మ్యానిఫెస్టో
చెన్నై :
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లపై హామీల వర్షం కురిపించిన అధికార డీఎంకే పార్టీ.. తాజాగా చెన్నై వాసుల మనసులూ గెలుచుకునేందుకు ప్రత్యేక మ్యానిఫెస్టోను ప్రకటించింది. ‘చెన్నై సూపర్‌-6’ పేరిట నగర ఓటర్లను ఆకట్టుకునేలా పలు హామీలు తీసుకొచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో దీన్ని ఆదివారం ఆవిష్కరించారు. నగరవాసుల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక మ్యానిఫెస్టో తీసుకొచ్చారు.
చెన్నై సూపర్‌-6లో ఆరు అంశాలను డీఎంకే ప్రస్తావించింది. నగరంలో సౌకర్యాలు మెరుగు పరచడం, వెయ్యి మినీ బస్సులు, ఏఐ సాయంతో ట్రాఫిక్‌ రద్దీని, ప్రయాణ సమయం తగ్గించ డం వంటివి ఇందులో ఉన్నాయి. నీటి కాలువలు, కీలక రహదారి ప్రాజె క్టులు పూర్తి చేయడం, రహదారుల వెంబడి చెట్ల పెంపకం, ప్రపంచస్థాయి సదు పాయాల కల్పన వంటి హామీలిచ్చింది. మెట్రో రైలు విస్తరణ, వీధికుక్కల ని యంత్రణ, వెటర్నరీ డాక్టర్ల సంఖ్యను మూడింతలు చేయడం, క్షేత్రస్థాయి సిబ్బంది పెంచడం వంటివీ జోడిం చింది. యువతను ఆకట్టుకోవడానికి రూ.10వేలకోట్ల టెక్నాలజీ హబ్‌ ఏర్పా టు వంటి హామీలు గుప్పించింది.

ఎందుకు కీలకం?
తమిళనాడులో ఎన్నికలు ఒక ఎత్తైతే రాజధాని చెన్నైలో పోరు మరో ఎత్తు. ఇక్కడ పట్టు సాధిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సులువని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అందుకే అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే డీఎంకే ప్రత్యేక మ్యానిఫెస్టో తీసుకురావడం గమనార్హం. గ్రేటర్‌ చెన్నై పరిధిలోని 22 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో డీఎంకే ఏకంగా 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, మరో ముగ్గురు ఇందులో ఉన్నారు. ఎన్డీయేలో అన్నాడీఎంకే 18 చోట్ల బరిలోకి దిగగా.. టీవీకే అధినేత విజరు ఇక్కడ పోటీ చేస్తుండటంతో పాటు పలుచోట్ల అభ్యర్థులను బరిలో ఉంచింది. ఏప్రిల్‌ 23న తమిళనాట ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -