Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో మళ్లీ పెరగనున్న చలి తీవ్రత..

తెలంగాణలో మళ్లీ పెరగనున్న చలి తీవ్రత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత మళ్లీ పెరగనుంది. సోమవారం నుంచి వారం రోజుల పాటు (జనవరి 5-12 వరకు) రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. గజగజ వణికించేలా చలిగాలులు వీస్తాయని, డిసెంబర్ మొదటి వారంలో ఉన్నటువంటి ‘కోల్డ్‌వేవ్’ పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయని పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 25-26 డిగ్రీల మధ్యనే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -