- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జనవరి 18న మేడారం మహాజాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సీతక్క, పోరిక బలరాం నాయక్తో కలిసి వనదేవతలను దర్శించుకొని, అభివృద్ధి పనులను పరిశీలించారు. మహాజాతర అభివృద్ధి పనులను జనవరి 12లోగా పూర్తి చేయాలని, పని చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. సీఎం 18న మేడారం వచ్చి రాత్రి బస చేసి, 19న ఉదయం వనదేవతలను దర్శించుకొని, అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని చెప్పారు.
- Advertisement -



