- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర గణనీయమైనదని మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో నవతెలంగాణ దినపత్రిక వార్షిక కాలమానిని, అలాగే నూతన డైరీ ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. సమ సమాజ నిర్మాణంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల యొక్క పాత్ర అద్వితీయమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ రవికుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



