– పట్టించుకొని ప్రభుత్వం
– ఏ వారం చూసినా నలుగురే… నాలుగు శాఖలే
నవతెలంగాణ మద్నూర్
ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల గైర్హాజర్ అవుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. సమస్యలు సమర్పించి పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ కోరుతుంటే.. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు గైర్హాజర్ అవుతుండటం ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపడుతూ వస్తుంది.
మండల ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా జిల్లా కేంద్రానికి వెళ్లకుండా మండల కేంద్రంలోని సమస్యలు తెలుపుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వం చూపిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం చేపడుతున్నప్పటికీ మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులగైర్హాజర్ పై ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టడం లేదనే వాదనలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఏ వారం చూసినా ఆ నలుగురే… ఆ నాలుగు శాఖల అధికారులు మాత్రమే కనబడుతున్నారు. సోమవారం నాడు తహశీల్దార్ ఎండి ముజీబ్ అధ్యక్షతన జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఆ నలుగురు ఆ నాలుగు శాఖలు ఎంపీడీవో రాణి, ఎంపీవో వెంకట నరసయ్య, ఏపీవో పద్మ , మండల వ్యవసాయ అధికారి రాజు మాత్రమే పాల్గొన్నారు. మండలంలో ఎన్నో శాఖలు ఉన్నప్పటికీ ప్రజావాణిలో ఆ నాలుగు శాఖలు మాత్రమే హాజరుగా అవుతున్నారు. మిగతా శాఖల అధికారులు గైర్హాజరుగా ఉంటున్నప్పటికీ అలాంటి శాఖల అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అనే విమర్శలు మండల ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని రకాల శాఖలు అధికారులు హాజరయ్యే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.



