భారత ఫుట్‌బాల్ దిగ్గజం నయీముద్దీన్
హైదరాబాద్ : సాకర్ చరిత్రలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందని భారత ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సయ్యద్ నయీముద్దీన్ అన్నాడు. ద్రోణచార్య, అర్జున రెండు క్రీడా అవార్డులను పొందిన ఏకైక క్రీడాకారుడు నయీముద్దీన్‌ను బుధవారం ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన క్లబ్‌లో జీఎం పెంటయ్య ఫుట్‌బాల్ అకాడమీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నయీముద్దీన మాట్లాడుతూ 1950 నుంచి 1970వ దశకంలో హైదరాబాద్ నుంచి ఎందరో గొప్ప ఫుట్‌బాలర్లు భారత జట్టుకు ఆడారు. భారత ఫుట్‌బాల్‌కు అదొక స్వర్ణ యుగమని చెప్పాడు. ప్రసుత్తం తెలంగాణలో ఫుట్‌బాల్‌కు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అభినందించాడు. సంతోష్ ట్రోఫీ, ఫిఫా ఇంటర్‌కాంటినెంటల్ కప్ వంటి టోర్నీలు నిర్వహణతో యువతలో సాకర్‌కు ఆదరణ పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ కార్యక్రమంలో భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్, తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఫల్గుణ, విజరు తదితరులు పాల్గొన్నారు.
సాకర్ చరిత్రలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం
- Advertisement -
- Advertisement -