ఢిల్లీపై ఘన విజయం
ముంబయి : ఐపిఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై 59 పరుగుల తేడాతో ముంబయి జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మొత్తంగా 13 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించిన ముంబయి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ముంబయికి ఇంకొక్క మ్యాచ్ మిగిలిఉంది. ఈ టోర్నిలో ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
కాగా, బుధవారం మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ నిలిపి 181 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ చతికిలబడింది. 18.2 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటయింది. జట్టులో సమీర్ రిజ్వి 39 పరుగులతో (35 బంతుల్లో సిక్స్, ఆరు ఫోర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో బుమ్రా, సాంత్నర్ చెరో మూడు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. 43 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ నాలుగు సిక్స్‌లు, ఏడు ఫోర్ల సాధించాడు. సూర్యకుమార్‌కు ప్లే ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
కుల్దీప్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో రికెల్టన్ వికెట్ తీయడంతో కుల్దీప్ యాదవ్ ఐపిఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనతను కుల్దీప్ 97 మ్యాచ్‌ల్లో సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు పూర్తి చేసిన టాప్-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఈ ముగ్గురూ 83 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ఈ జాబితాలో చహల్ (84 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (86) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. కుల్దీప్ నాలుగో స్థానంలో నిలిచాడు.
ప్లేఆఫ్స్‌కు ముంబయి
- Advertisement -
- Advertisement -