నవతెలంగాణ – ఆలేరు టౌను
ట్రాక్మెన్ గా రైల్వేలో విధులు నిర్వహించిన, మధు కుమార్ చేసిన సేవలు చిరస్మరణీయమని, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, సిసిఎస్ ప్రెసిడెంట్, చిలుకు స్వామి అన్నారు. ఇటీవల యూనిట్ నెంబర్ 6 నందు ట్రాక్మెన్ గా విధులు నిర్వహిస్తూ, ప్రమాదవశాత్తు మరణించిన మధు కుమార్ కు ఆలేరు పట్టణంలో బుధవారం బ్రాంచ్ ఆధ్వర్యంలో సీసీఎస్ సొసైటీ ద్వారా, మ్యాచ్ వల్డ్ బెనిఫిట్ ఫండ్ రూ.4 లక్షల 74 వేల, 995 చెక్కును మృతుడి భార్య సునీతకు అందజేశారు.
ఆలేరు బ్రాంచ్ ఆధ్వర్యంలో గతంలో మజ్దూర్ యూనియన్ ఇన్సూరెన్స్ కింద రూ.50 వేల తక్షణ ఆర్థిక సహాయంగా, డివిజనల్ నాయకులు రవీందర్ అందజేశారని తెలిపారు. సిసిఎస్ సంస్థ నుండి ఫినరాల్ అమౌంట్ కింద రూ.10000 వేలు అందజేశారన్నారు. మధుకుమార్ ట్రాక్మెన్ ఆలేరు సిసిఎస్ సంస్థలో తీసుకున్నటువంటి రుణాలు 6.03,890 /- మాఫీ చేయడం జరిగిందని, సిసిఎస్ ప్రెసిడెంట్ & అసిస్టెంట్ డివిజనల్ సెక్రెటరీ చిలుకు స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ చైర్మెన్, సెక్రెటరీ, సిసిఎస్ డెల్గేట్,డివిజనల్ యూత్ కమిటీ మెంబర్ ,ఆలేరు బ్రాంచ్ కార్యవర్గం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.



