నవతెలంగాణ – హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,షేక్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలోకి నీరు చేరుకుంది. రోడ్లన్ని జలమయంగా మారాయి. ఉదయం అంతా ఆఫీసులకు వెళ్లే సమయం కావటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా నగరంలో మరో నాలుగు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక, బుధవారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా బండ్లగూడలో 8.88 సెంటిమీటర్లు, అంబర్ పేటలో 8.50, సైదాబాద్ 8.38, సరూర్ నగర్ 8.08, ఉప్పల్ 7.75, హిమాయత్ నగర్ 6.30, చార్మినార్లో 5.85 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎడతెరిపి లేని వానలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES