- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు:
మునుగోడు ఎస్సై ఇరుగు రవి కి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, ఇటీవల కాల్వలపల్లి ఉపసర్పంచ్ గా ఎన్నికైన శివర్ల వీరమల్లు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రత కోసం 24 గంటలు విధులు నిర్వహించి, మండలంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన మొదటిగా గుర్తుకొచ్చేది పోలీసులు అని అన్నారు. అలాంటి బాధ్యతగల ఉద్యోగమును పొంది ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. మండలంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన వారికి చట్టపరంగా న్యాయం చేస్తే అధికారులను ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని అన్నారు.
- Advertisement -



