Thursday, May 22, 2025
Homeజాతీయంవడగళ్ల వానకు ధ్వంసమైన విమానం

వడగళ్ల వానకు ధ్వంసమైన విమానం

- Advertisement -

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ శ్రీన‌గ‌ర్ విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. 220 మంది ప్ర‌యాణికుల‌తో వెళుతున్న ఇండిగో విమానం వడగల్ల వాన కారణంగా తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో పైల‌ట్ శ్రీన‌గర్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం తీవ్రంగా అతలాకుతలం అవ్వడంతో ప్రయాణికులు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ప్రార్థనలు చేశారు. చివరికి పైలట్ చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్ లో ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో విమానం ముందు భాగం ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -