Monday, July 13, 2026
E-PAPER
Homeజాతీయంకన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

- Advertisement -

మైసూరులో అధికారిక లాంఛనాలతో
జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
అంతిమయాత్రలో భారీగా పాల్గొన్న అభిమానులు

మైసూరు : గానకోకిల ఎస్. జానకి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. కర్నా టక ప్రభుత్వం జానకమ్మ అంత్యక్రియలను మైసూరులో అధికారిక లాంఛనాలతో జరిపించింది. ఆమె అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. జానకమ్మ కోరిక మేరకు కణియనహుండి ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు జరిపించారు. అభిమాని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు హెచ్.డి. కోటే తాలూకాలోని కనియనహుండి గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో సాయంత్రం జానకి అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి అధికారిక లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జానకి కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలోనే మరణించడంతో ఆమె మనవరాలు అప్సర దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించారు. కనియనహుండి గ్రామంలోని జానకి అభిమాని నవీన్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఈ అంత్యక్రియలు జరిగాయి.

భావోద్వేగానికి గురైన అభిమానులు
ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మహారాజా కాలేజ్ మైదానంలో సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, కళాకారులు, వేలాది మంది అభిమానులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ నివాళులర్పించారు. అనంతరం అంతిమ సంస్కారాల కోసం ఆమె భౌతికకాయాన్ని హెచ్.డి. కోటె తాలూకాలోని కనియనహుండి తోటలోకి తరలించారు. అక్కడ కాసేపు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం 3:05 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది. 
ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు, అధికారులు వాహనాల్లో వెంట వెళ్లారు. తమ అభిమాన గాయనికి చివరిసారిగా అభిమానులు దారి పొడవునా నీరాజనం పట్టారు. పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -