శ్రీ సోమేశ్వర్ రైతు సంఘానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి..
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గల శ్రీ సోమేశ్వర స్వామి రైతు సంఘానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ఎంపీ చామల కుమార్ రెడ్డికి రైతు సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు.పది సంవత్సరాల క్రితం స్వచ్ఛందంగా ఏర్పాటైన శ్రీ సోమేశ్వర స్వామి రైతు సంఘం గ్రామ రైతులతో పాటు పక్క గ్రామాల రైతులకు కూడా ఎరువులు,విత్తనాలు, క్రిమిసంహారక మందులు, పశువులకు అవసరమైన దాణను సరసమైన ధరలకు అందిస్తూ సేవలందిస్తోంది.
రైతు సంఘం భవనాన్ని నిర్మించుకున్నప్పటికీ, మరికొన్ని సౌకర్యాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు సంఘం ప్రతినిధులు తెలిపారు.ఈ నేపథ్యంలో ఎంపీ నిధుల నుంచి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేయాలని వారు కోరారు.ఈ వినతికి సంబంధించి ఎంపీ సానుకూలంగా స్పందించి,సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ ఆరుట్ల శ్రీకాంత్ రెడ్డి,మాజీ ఎంపిటిసి అరె ప్రశాంత్, శ్రీ సోమేశ్వర స్వామి రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ బైరి రమేష్ , ఉపాధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి చీరబోయిన మల్లేశం,కోశాధికారి గాదె సోమిరెడ్డి మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



