Friday, January 9, 2026
E-PAPER
Homeకరీంనగర్అడవుల్లో అగ్ని ప్రమాదాలు నివారించాలి

అడవుల్లో అగ్ని ప్రమాదాలు నివారించాలి

- Advertisement -

డిప్యూటీ రేంజర్ పద్మ
నవతెలంగాణ – రాయికల్

మండలంలోని జగన్నాథ్‌పూర్ గ్రామంలో అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ పద్మ పర్యావరణ అవగాహన సదస్సు నిర్వహించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి అడవులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. అడవుల్లో అగ్నిప్రమాదం సంభవించినట్లయితే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 8004255364కు సమాచారం అందించి అగ్ని ప్రమాదాలను నివారించడంలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవులు మన జీవనాధారం అని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరాచ శంకర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలియాజ్, పంచాయతీ కార్యదర్శి గుర్రాల మౌనిక, వ్యవసాయ అధికారి నరేష్, బేస్ క్యాంప్ సిబ్బంది శివ, రాజం, కారోబార్ రమ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -