Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యలు చెప్పడానికి వేదికేది.? 

సమస్యలు చెప్పడానికి వేదికేది.? 

- Advertisement -

మండల సభ ఏర్పాటు చేయాలంటున్న సర్పంచ్ లు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఇటీవల నూతనంగా ఎన్నికై బాధ్యతలు  సర్పంచులు గ్రామ సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదని పేర్కొంటున్నారు. గతంలో మండల పరిషత్ పాలకవర్గం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలలో సర్పంచులు తమ గ్రామ సమస్యలు అధికారు లకు తెలిపేవారు. దీంతో అధికారులకు సర్పంచులకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు లేక మండల సభలు జరగడం లేదు. గత డిసెంబర్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామ సమస్యలు ఎలా తెలుపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశం..
గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచులు హాజరు అయ్యేవారు. డివిజన్, మండల స్థాయి అధికారులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు అయ్యేవారు. అలాగే మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమ శాఖ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయ, విద్యా, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్ డబ్లూఎస్ ఇంజినీరింగ్, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్దక, రెవెన్యూ ఇలా 15 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు.

ఈ సమయంలో శాఖల వారి అధికారులు తమ నివేదిక చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. దీంతో గ్రామ సర్పంచులకు, మండల అధికారులకు మధ్య మంచి సంబందాలు ఏర్పడేవి. డివిజన్ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకు పోయిన సమస్యల పరిశ్కారానికి మండల సభలు వేదికలు అయ్యేవి. 

గ్రామాల సమస్యలు ఎలా తెలపాలి.?
గడువు ముగిసిన వెంటనే గ్రామపంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్ నెలలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీ రహదారులు, మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది.

ఈ క్రమంలో సర్పంచులు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు సర్పంచ్ లు అంటున్నారు. మండల సభ ఏర్పాటు చేస్తే అధికారులకు,సర్పం చులకు మధ్య సమన్వయం ఏర్పడుతుందని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -