Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయందేశాన్ని ర‌క్షించ‌లేని నీచమైన హోంమంత్రి అమిత్ షా: సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

దేశాన్ని ర‌క్షించ‌లేని నీచమైన హోంమంత్రి అమిత్ షా: సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈడీ దాడుల ముసుగులో త‌మ పార్టీకి సంబంధించిన కీల‌క విష‌యాల‌ను చోరీ చేస్తుంద‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. గురువారం అనూహ్యంగా కోల్‌కతాలో పలుచోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఐపీఏసీ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంపై అధికారులు దాడులు చేశారు. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా మాట్లాడుతూ….తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత వ్యూహం, అభ్యర్థుల జాబితాలు, గోప్యమైన డిజిటల్ మెటీరియల్‌ను ఈడీ దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అటువంటి సమాచారానికి ఎటువంటి ఆర్థిక దర్యాప్తుతో సంబంధం లేదన్నారు.

పార్టీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను, అభ్యర్థుల జాబితాను సేకరించడమే ఈడీ, అమిత్ షా పనినా? దేశాన్ని రక్షించలేని ఈ నీచమైన, దుష్ట హోంమంత్రి నా పార్టీ పత్రాలను ఎలా తీసుకెళ్తాడు. నేను గనుక బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఒక వైపు పశ్చిమ బెంగాల్‌లో SIR నిర్వహించి ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారు. ఇప్పుడేమో నా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.’’ అంటూ మమత మండిప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -