Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు భద్రత.. స.హ.చట్టంపై అవగాహన

రోడ్డు భద్రత.. స.హ.చట్టంపై అవగాహన

- Advertisement -

చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కోయడి నర్సింహులు గౌడ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రమాదాలు,సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం అని చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కోయడి నర్సింహులు గౌడ్ అన్నారు. గురువారం నగరంలోని పులాంగ్ లో గల స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రమాదాలు అలాగే సమాచార హక్కు చట్టంపై చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కార్యదర్శి గంగాధర్ తెలిపారు. స్కూలు హెడ్మాస్టర్ నాగరాజు  అధ్యక్షత వహించగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కోయడి నర్సింలు గౌడ్ మాట్లాడుతూ..  నేటి విద్యార్థులే రేపటి పౌరులని సమాజం మారాలంటే విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెరగాలని ప్రతిదీ అవగాహన చేసుకుని ప్రశ్నించే తత్వాన్ని అలవార్చుకొని హక్కులు, బాధ్యతలను సమానంగా ఆచారించాలి.

వాహనం నడిపేటప్పుడు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అతివేగం, తాగి డ్రైవింగ్ చేయడం సెల్ ఫోన్ మాట్లాడం చేయవద్దని లేనట్లయితే ప్రమాదంలో మరణం, కాళ్ళు చేతులు విరగడం లాంటి అనేక సంఘటనలు జరుగుతాయన్నారు. రోడ్డు ప్రమాదాలులేనీ, అవినీతి లంచగొండి లేని సమాజాన్ని సాధించాలంటే విద్యార్థులు, యువకుల్లో సామాజిక అంశాలపట్ల అవగాహనా, చైతన్యం అవసరం అన్నారు. అందుకే రోడ్డు భద్రత మాసత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిరహించామన్నారు. ఆర్.టి ఐ వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ రాంరాజ్ రాథోడ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరాలని భగతసింగ్, అల్లురి సీతారామరాజు లాగ యదగాలని అన్నారు.

ప్రతీది ఎదిరించి పోరాడాలన్నారు. సమాచారం హక్కు చట్టం గురించి వివరించారు. స్కూల్ హెచ్ఎం నాగరాజు మాట్లాడుతూ..  అన్ని తెలుసుకొని, ఆలోచించుకొని చక్కగా వినియోగించుకొని విధులను, బాధ్యతగా స్వీకరించే టట్లు ఎదగాలని అనేక అంశాల పట్ల చైతన్యం చేసిన సొసైటీ బాద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ రఫత్, నిఖిత తో పాటు గంగాధర్, అశోక్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -