Saturday, January 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలువీబీ జీ రామ్ జీ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు పోరాటం: సీఎం

వీబీ జీ రామ్ జీ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు పోరాటం: సీఎం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అధికారంలో ఉందని మోడీ సర్కార్ ఇష్టం వచ్చినట్టు చేస్తోందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఉపాధీ హామీ పథకంలో  మహాత్మగాంధీ పేరు మార్పు బీజేపీ కుట్ర అని అన్నారు.  ఉపాధి హామీ పథకం  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్పారు.  ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు  మోడీ సర్కార్ కుట్ర చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే పోరాటం చేయాలన్నారు. వీబీ జీ  రామ్ జీ చట్టాన్ని  కేంద్రం వెనక్కి తీసుకునే వరకు  పోరాటం చేస్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అన్ని సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేసేవారు. తద్వారా పేదల హక్కులను కాలరాయాలని చూశారు. కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. ప్రజలను కాంగ్రెస్‌ అప్రమత్తం చేయడంతో బీజేపీ 240 సీట్ల వద్ద ఆగిపోయింది. దీంతో రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వాయిదా పడింది. ఓట్లను తొలగించేందుకు ఎస్‌ఐఆర్‌ తీసుకొచ్చారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -