వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడి
కుమారుడి మరణంతో వాగ్దానం
న్యూఢిల్లీ : తన సంపాదనలో 75 శాతాన్ని సమాజానికి ఇచ్చేస్తానని గనుల రంగ దిగ్గజ సంస్థ వేదాంతా చైర్మెన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఇటీవల ఆయన కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ 49 ఏండ్లకే హఠాత్తుగా మరణించారు. వేదాంతా అనుబంధ సంస్థ తల్వండి సోబో పవర్ లిమిటెడ్‌కు అగ్నివేశ్ చైర్మెన్‌గా ఉన్నారు. అగ్నివేశ్ అకాల మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుడి మరణంతో తన జీవితంలో చీకట్లు కమ్మాయని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా తమ సంపాదనలో 75 శాతం సమాజానికి తిరిగిస్తానని అగ్నికి వాగ్దానం చేసినట్లు అనిల్ అగర్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమెరికాలో జరిగిన స్కైయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్, ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో తమని విడిచివెళ్లిపోయాడని పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఎంతో ఒదిగి ఉండేవాడని.. ఒక ఫ్రెండ్‌లా తన వెంటే ఉండేవాడని తెలిపారు. ‘నువ్వు లేకుండా ఈ దారిలో ఎలా నడవాలో నాకు తెలియడం లేదని.. కానీ నీ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను” అని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. అనిల్ అగర్వాల్‌కు అగ్నివేశ్‌తో పాటు కుమార్తె ప్రియ ఉన్నారు. ఆమె వేదాంతా లిమిటెడ్ బోర్డు మెంబర్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌కు చైౖర్‌పర్సన్‌గా పని చేస్తోన్నారు. అనిల్ అగర్వాల్ నికర సంపద 330 కోట్ల డాలర్లు (దాదాపు రూ.30 లక్షల కోట్లు)గా ఉంది.
75 శాతం సంపాదనను పంచేస్తా..!
- Advertisement -
- Advertisement -



