Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దవూరలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రారంభం

పెద్దవూరలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రారంభం

- Advertisement -


నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం లోని జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం సంక్రాంతికి ముందే సందడి నెలకొంది. మండల ఎంఈఓ తరి రాము, స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగా రెడ్డి, హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పబ్బు యాదగిరి, స్థానిక సర్పంచి ఐత బోయిన వేంకటయ్య వేడుకలా ప్రారంభించారు. ఈ సందర్బంగా తమ పిల్లలకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేందుకు విద్యార్థిని విద్యార్థులతో పలు కార్యక్రమాలు నిర్వహించింది.

హరిదాసుల కథలు, పురాతన కాలంలోమాదిరి పిడకల పొయ్యిపై పరమాన్నం వండండం, పూరి గుడిసెల ప్రభల అలంకరణలు ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం భోగి మంటలు వేసి వాటి ప్రాధాన్యాన్ని చిన్నారులకు వివరించింది. చిన్నారులంతా పట్టు పరికిణీలతో, సాంప్రదాయ వస్త్రధారణతో ఆనందంగా జరిగాయి. కోడి పందాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు రంగురంగుల బెలూన్లు ఎగరవేసి భోగి మంట చుట్టు చేరి ఆడి పాడారు.

సంప్రదాయమైన కోడిపందాలను పిల్లలు ఆసక్తిగా తిలకించారు. రెండెడ్ల బండిపై సవారీలు చిన్నారులను ఆకట్టుకున్నాయి. డూడూ బసవన్న విన్యాసాలు, భవిష్యత్తును వివరించే సోదమ్మ ఇలా ప్రతి అంశాన్ని చిన్నారులకు వివరిస్తూ వారితో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈసందర్బంగా కర్నాటి.లింగారెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేస్తే చిన్నారులకు మన సంస్కృతి, సంప్రదాయలపై ఓ అవగాహన ఏర్పడుతుందని  అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నీ ఉపాధ్యయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -